PM Modi Sindoor Plant: పీఎం నరేంద్ర మోదీ తన నివాసంలో సింధూర్ మొక్కను నాటారు.బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971 లో పాకిస్థాన్ తో భారత్ చేసిన యుద్ధంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన మహిళా బృందం ఇచ్చిన ఈ మొక్కను..పర్యావరణ దినోత్సవం సందర్భంగా నాటారు. అందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్థాన్ తో భారత్ చేసిన యుద్ధంలో కచ్ కు చెందిన తల్లులు, సోదరీమణులు తమ వీర పరాక్రమాలను ప్రదర్శించారని మోదీ అన్నారు.