
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సతాప్ మృతికి ప్రధాని నరేంద్రమోదీ సంతాపం తెలియజేశారు. రాజీవ్ సతాప్ రాజకీయాల్లో బాగా ఎదుగుతూ ప్రాణాలు కోల్సోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. నా పార్లమెంట్ మిత్రుడు రాజీవ్ సతావ్ మరణం నన్ను కలచివేసింది. రాజీవ్ సతాప్ సమర్థమైన పనీతీరుతో ఎదుగుతున్న నాయకుడు. రాజీవ్ కుటుంబానికి, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా ఓం శాంతి అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.