
తెలంగాణ రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు, వైద్యరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి, డీజీపీ మహేందర్ రెడ్డి హైకోర్టుకు నివేదిక సమర్పించారు. గత నెల 29 వ తేదీ నుంచి రోజుకు సరాసరి లక్ష కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు డీహెచ్ వివరించారు. కరోనా మూడో దశ వస్తే ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నట్లు హైకోర్టుకు సమర్పించిన నివేదికలో డీహెచ్ పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో 10,366 బెడ్లను ఆక్సిజన్ పడకలుగా మార్చినట్లు చెప్పారు. మరో 15 వేల పడకలకు కూడా ఆక్సిజన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.