
ఏపీలో పరిషత్ ఎన్నికల వ్యవహారంలో రీనోటిఫికేషన్ ఇవ్వాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. తుది తీర్పు వచ్చేవరకు ఓట్ల లెక్కింపు చేపట్టొద్దని ఆదేశించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై డివిజన్ బెంచ్ లో ఎస్ఈసీ అప్పీలు చేసింది. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ రీ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ సింగిల్ జడ్జి గతంలో ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చింది. తదుపరి విచారణను జూలై 27కి వాయిదా వేసింది.