
రాష్టంలో శాంతి భద్రతలను కాపాడవలసిన బాధ్యత పోలీసులది. అటువంటి యంత్రంగం రాజకీయ ఒత్తిడిలకు తలోగ్గకుండా పనిచేసినట్లైతే రాష్టం అభివృద్ధి దశలో ఉంటుంది. దీని కోసం పోలీస్ యంత్రంగంలో సంస్కరణలు చెయ్యాలని సుప్రీమ్ కోర్ట్ 14సంవత్సరాల క్రితమే కొన్ని సూచనలు చేసింది. ఆ సూచనల ఆధారంగా పోలీస్ వ్యవస్థలో సంస్కారనలు అమలు చేస్తున్న రాష్టాల్లో ఆంధ్రప్రదేశ్, అస్సాం లు అద్భుతంగా కృషి చేస్తున్నాయి అని ఇంటర్నేషనల్ కామన్‌వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇన్షియేటివ్’ తాజా నివేదికలో వెల్లడించింది.