
జమ్మూకశ్మీరులోని శ్రీనగర్ లోని సైద్ పొరా ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు మరణించారు. సైద్ పొరా ప్రాంతంలో జమ్మూకశ్మీర్ పోలీసు విభాగానికి చెందిన జావీద్ అహ్మద్ ఇంటి సమీపంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రవాదుల కాల్పుల్లో జావీద్ అహ్మద్ తీవ్రంగా గాయపడటంతో అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, ఆయన పరిస్థితి విషమించి మరణించాడు. ఉగ్రవాదుల కాల్పుల ఘటన అనంతరం కేంద్ర భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. కాల్పులు జరిపిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు ముమ్మరంగా గాలిస్తున్నామని జమ్ముకశ్మీర్ పోలీసులు చెప్పారు.