
కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా పలు మంత్రిత్వ శాఖల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ క్రమంలో మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అనారోగ్య సమస్యల కారణంగా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు తెలిసింది. కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ బాధ్యతలు చూస్తున్న సంతోశ్ కుమార్ గంగ్వార్ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. అలాగే, కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి దేవశ్రీ చౌధురీ కూడా తన పదవికి రాజీనామా చేశారు.