https://oktelugu.com/

Palm :  మీ అరచేతిలో A అక్షరం ఉందా? అయితే ఇది తెలుసుకోండి.

అక్షరాలు A నుంచి Z వరకు ఉంటాయని తెలిసిందే కదా. కొన్ని రకాల గుర్తులు అదృష్టాన్ని సూచిస్తాయి. కానీ మరికొన్ని అనారోగ్యాన్ని, దారిద్య్రాన్ని సూచిస్తుంటాయి. మరికొందరు చేతిలో 'A' అనే అక్షరం ఉంటుంది. ఇది దేనికి సంకేతమూ తెలుసా? అదే తెలుసుకుందాం. అరచేతిపై 'A' గుర్తు ఉంటే నిపుణులు చాలా పవిత్రంగా భావిస్తారట.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 18, 2024 / 01:14 AM IST

    A' shaped palm

    Follow us on

    Palm :  చాలామంది జాతకాలు నమ్ముతారు. పేర్లతో, మొహం తో, చేతులను చూసి కూడా జాతకాలు చెబుతుంటారు. అంతేకాదు దానికి పరిష్కార మార్గాలు కూడా చూపిస్తుంటారు. దీనివల్ల కొందరి లైఫ్ లో మంచి ఫలితాలు సంభవిస్తే కొందరికి ఎలాంటి రిజల్ట్ ఉండదు. అరచేతిలో ఉండే రేఖలు, గుర్తులు మొదలైన వాటి సహాయంతో ఒక వ్యక్తి గతం, భవిష్యత్తుతో పాటు అంచనా వేయచ్చు అంటున్నారు పండితులు. ఇలా ఎన్నో విషయాల గురించి చెబుతుంటారు కదా. అంతేకాదు అరచేతి గీతలను బట్టి వ్యక్తి ఆర్థిక స్థితి, వైవాహిక జీవితం, ఆరోగ్యం, వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన ఎంతో సమాచారాన్ని తెలపవచ్చు అంటున్నారు హస్తరేఖ నిపుణులు. అయితే చాలాసార్లు చేతి రేఖల్లో ఇంగ్లీష్ అక్షరాల ఆకారాలు చాలా మంది చేతిలో కనిపిస్తుంటాయి.

    అక్షరాలు A నుంచి Z వరకు ఉంటాయని తెలిసిందే కదా. కొన్ని రకాల గుర్తులు అదృష్టాన్ని సూచిస్తాయి. కానీ మరికొన్ని అనారోగ్యాన్ని, దారిద్య్రాన్ని సూచిస్తుంటాయి. మరికొందరు చేతిలో ‘A’ అనే అక్షరం ఉంటుంది. ఇది దేనికి సంకేతమూ తెలుసా? అదే తెలుసుకుందాం. అరచేతిపై ‘A’ గుర్తు ఉంటే నిపుణులు చాలా పవిత్రంగా భావిస్తారట. సాధారణంగా ఈ గుర్తు అందరి చేతిలో ఉండదు. కేవలం కొందరిలో మాత్రమే ఉంటుంది. అరచేతిలో ‘A’ ఆకారం ఉన్న వ్యక్తులు అదృష్టవంతులట. ధనవంతులు గా ఉంటారు. అవుతారు కూడా. పట్టిందల్లా పసిడే అవుతుంది. మంచి వ్యాపారాలు అవుతారు.

    అరచేతిలో ఎ గుర్తు ఉన్నవారు తమ కుటుంబం పట్ల చాలా శ్రద్ధగా ఉంటారు. వృత్తినీ, కుటుంబ సంబంధాలను బ్యాలెన్స్ చేస్తారు. ఇంట్లో బయట సానుకూల వాతావరణం ఏర్పరుచుకుంటారు. అంతేకాదు తమ సమస్యలకు తమదైన పరిష్కారాలను కనుగొంటారు ఈ వ్యక్తులు.

    ఈ గుర్తు ఉన్న వ్యక్తులు స్నేహ పూర్వక స్వభావంతో ఉంటారట. ఇతరులకు సహాయం చేయడానికి వీరు ఎల్లప్పుడూ ముందే ఉంటారు. తమ చుట్టూ ఉండే మనుషులను మంచి తనంతో, స్నేహభావంతో ఆకట్టుకుంటారు. అరచేతిలో A ఉన్నవారు వృత్తిపరంగా పేరు సంపాదిస్తారు. పూర్తి అంకిత భావంతో ఉంటూ పనులు పూర్తి చేస్తారు. కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది అంటున్నారు నిపుణులు. ఈ గుర్తు ఉన్నవారు తెలివైన వారుగా రాజ్యమేలుతారు. ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసంతో ఉంటారు.  భవిష్యత్తు చక్కగా మలుచుకుంటారు.  ఎన్ని కష్టాలు ఎదురైనా తట్టుకుంటారు.  ఉన్నత స్థాయికి ఎదుగుతారు.

    అరచేతిలో ఏ అక్షరం ఉన్నవారికి డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉండవు. ఉన్నా కూడా చాలా అరుదుగా వస్తుంటాయి. వాటిని కూడా వీరు చాలా తెలివిగా పరిష్కారం కనుగ్గొంటారు. కుటుంబానికి మాత్రమే కాదు జీవిత భాగస్వామికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుంటారు. దీంతో జీవితంలో సంతోషంగా ఉంటారు. పార్టనర్ ను ఉంచుతారు. బంధువులు, స్నేహితులతో మంచి సంబంధాలు ఏర్పరచుకుంటారు అని చెబుతుంది హస్తరేఖ శాస్త్రం.

    Disclaimer :  ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు..