
కరోనా మహమ్మారిపై కలిసికట్టుగా పోరాడదామని పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్మాన్ ఖాన్ పిలుపునిచ్చారు. ప్రపంచానికి ఈ వైరస్ విసురుతున్న సవాలును ఎదుర్కొనడంలో భారత దేశానికి సంఘీభావం ప్రకటించారు. పొరుగు దేశాలు, ప్రపంచంలో ఈ వ్యాధి బారిన పడిన వారంతా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఇమ్రాన్ ఖాన్ శనివారం ఓ ట్వీట్ చేశారు.