Thug Life London: ఇంగ్లండ్ రాజధాని లండన్ నగరం ఈ రెండు వారాల పాటు ఓ వినూత్న ప్రచారానికి వేదిక కానుంది. స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన “#ThugLife” థీమ్‌తో పూర్తిగా డిజైన్ చేసిన 100కు పైగా ఐకానిక్ రెడ్ బస్సులు నగర వీధుల్లో పరుగులు పెడుతున్నాయి. ఈ ఫుల్-ర్యాప్ బస్సులు ప్రస్తుతం నగరవాసులకు, పర్యాటకులకు ఆహ్లాదకర అనుభూతిని అందిస్తున్నాయి.
ఈ “Thug Life Madness” ప్రచారం ఇవాళ కొన్ని గంటల్లో అధికారికంగా ప్రారంభం కానుంది. “Streets belong to the THUGS” అనే నినాదంతో ఈ ప్రచారానికి ఊపు తెస్తున్నారు నిర్వాహకులు. ప్రతి మూలకూ, ప్రతి ట్రాఫిక్ లైట్‌కి “Thug Life” స్టయిలే కనిపించనుంది. ఈ క్రేజీ విహారాన్ని రెండు వారాలపాటు మాత్రమే ఆస్వాదించగలుగుతారు. లండన్ వీధుల్లో తిరుగుతున్న ఈ మాస్ స్టైల్ బస్సులు ఇప్పుడు సినిమాకు కావాల్సిన ప్రమోషన్ ను అందిస్తున్నాయి. దీన్ని బట్టి ప్రపంచవ్యాప్తంగా THUG LIFE మానియా మొదలవుతుంది!
100+ iconic London buses fully wrapped in #ThugLife madness are taking over the city! Streets belong to the THUGS — catch them while you can over the next 2 weeks!
PREMIERES IN A FEW HOURS! @cinema_boleyn @ikamalhaasan @SilambarasanTR_ @arrahman @RKFI… pic.twitter.com/wNL2y0bdl7
— Ahimsa Entertainment (@ahimsafilms) June 4, 2025