
ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. కొవిడ్ వల్ల పరీక్షలు లేకుండానే ప్రభుత్వం విద్యార్థులను ప్రమోట్ చేసింది. అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు అన్ ఎయిడెడ్ స్కూళ్లకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి. కొవిడ్ సంక్షోభం కారణంగా ఏప్రిల్ 27 నుంచి మే 31 వ తేదీ వరకు అన్ని స్కూళ్లు కాలేజీలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే.