
ఆర్టీసీ ఉద్యోగుకలు కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నది. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను ప్రభుత్వం సూపర్ స్ప్రడర్స్ గా గుర్తించి టీకాలు వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వివిధ జిల్లాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకున్నది. ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని ఆరు డిపోల్లో 2,620 మందికీ టీకా ఇవ్వనున్నట్లు వైద్యశాఖ సిబ్బంది తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఆర్టీసీ ఉద్యోగులకు వ్యాక్సిన్ వేసే వార్యక్రమాన్ని సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య ప్రారంభించారు.