
ఏపీలోని కడప జిల్లాలో మైదుకూరు మండలం బయనపల్లి వద్ద జరిగిన రోడ్డుె ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్ ను ఢీకొనడంతో ఆ ప్రమాదం జరిగింది. మృతుడు దువ్వూరు మండలం అన్నపుశాస్త్రులపల్లెకు చెందిన ఆంజనేయులుగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్నిస్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.