
వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు ను సీఐడీ అధికారులు అరెస్టు చేసిన తీరు, తదనంతర పరిణామాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఏపీ డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శిలకు నోటీసులు పంపింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కస్టడీలో రఘురామ పై పోలీసులు దాడి విషయంలో అంతర్గత విచారణకు ఎన్ హెచ్ ఆర్ సీ ఆదేశించింది. జూన్ 7 లోగా నివేదిక ఇవ్వాలని డీజీని ఆదేశించింది. రఘురామ అరెస్టు తీరుపై ఆయన తనయుడు భరత్ ఫిర్యాదు మేరకు ఎన్ హెచ్ ఆర్ సీ స్పందించింది.