
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యల కట్టడికి శాస్త్రీయంగా చర్యలు తీసుకోకపోవడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని అందుకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సుప్రీంకోర్టు న్యాయవాది చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎన్ హచ్ ఆర్ సీ స్పందించింది. తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదిక సమర్పించాలని గత ఏడాది డిసెంబరులో రెండు రాష్ట్రాల సీఎస్ లను ఎన్ హెచ్ ఆర్ సీ ఆదేశించింది.