https://oktelugu.com/

భారత్ కు సాయం ప్రకటించిన న్యూయార్క్ సిటీ

కరోనా తో పోరాడుతున్న భారతేదేశానికి న్యూయార్క్ సిటీ సాయం ప్రకటించింది. క్లిష్ట పరిస్థితుల్లో అవసరమైన వైద్య సామగ్రి పంపనున్నట్లు మేయర్ బిల్ డి బ్లాసియో ప్రకటించారు. 40 లక్షల టెస్ట్ కిట్లు, మూడు లక్షల పల్స్ ఆక్సీమీటర్లు, 300 వెంటిలెటర్లు, బిపాప్ యంత్రాలు ఇతర వైద్య సామగ్రిని పంపుతున్నట్లు తెలిపారు. కరోనాపై పోరాటంలో ఎవరూ ఒంటరిగా లేరని, ఈ మేరకు సందేశం ఇచ్చేందుకు వైద్య పరికరాలను పంపుతున్నట్లు చెప్పారు. మేయర్ ప్రకటనపై భారత్ కాన్పుల్ జనరల్ రణధీర్ […]

Written By: , Updated On : May 15, 2021 / 09:48 AM IST
Follow us on

కరోనా తో పోరాడుతున్న భారతేదేశానికి న్యూయార్క్ సిటీ సాయం ప్రకటించింది. క్లిష్ట పరిస్థితుల్లో అవసరమైన వైద్య సామగ్రి పంపనున్నట్లు మేయర్ బిల్ డి బ్లాసియో ప్రకటించారు. 40 లక్షల టెస్ట్ కిట్లు, మూడు లక్షల పల్స్ ఆక్సీమీటర్లు, 300 వెంటిలెటర్లు, బిపాప్ యంత్రాలు ఇతర వైద్య సామగ్రిని పంపుతున్నట్లు తెలిపారు. కరోనాపై పోరాటంలో ఎవరూ ఒంటరిగా లేరని, ఈ మేరకు సందేశం ఇచ్చేందుకు వైద్య పరికరాలను పంపుతున్నట్లు చెప్పారు. మేయర్ ప్రకటనపై భారత్ కాన్పుల్ జనరల్ రణధీర్ జైస్వాల్ అభినందనలు తెలిపారు.