
తాజాగా హేమ ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్ మీద సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై నరేశ్, జీవితలు మాట్లాడుతూ అసోసియేషన్ గౌరవన్నా దెబ్బతీసేలా హేమ మాట్లాడుతున్నారని, తను ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధకరం అన్నారు. హైమపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామని, కమిటీ నిర్ణయం ప్రకారం తగిన చర్యలు తప్పవని అన్నారు. మేము మాకున్న ఇమేజ్ తో ఫండ్ తెస్తున్నాం తప్ప ఖర్చు పెట్టడం లేదు. ఈ టర్మ్ లో కోటి రూపాయల ఫండ్ సమకుర్చామని నరేశ్ తెలిపారు. కరోనా దృష్ట్య ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.