
బండి సంజయ్ పై మైనంపల్లి హనుమంతరావు ఫైర్ అయ్యారు. కరీంనగర్ నుంచి వందలాది కాల్స్ వస్తున్నాయని బండి సంజయ్ ని ఎంపీ పదవి నుంచి దింపే వరకు ఉరుకోనని అన్నారు. పూర్తి ఆధారాలతో బండి సంజయ్ పై మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని తెలిపారు. నీకు భయపడేవాళ్లు ఎవరూ లేరు. ఏ పరిణామాలైనా ఎదుర్కొనేందుకు సిద్ధం అని మైనంపల్లి హెచ్చరించారు. దళితుల పై దాడి చేశానని అంటున్నారు. నేపు ఎక్కడ లేను సీసీ టీవీ ఫుటేజ్ చూడండని అన్నారు. బండి సంజయ్ కి దమ్ముంటే తన ముందుకొచ్చి ఆరోపణలు చేయాలని సవాల్ విసిరారు.