
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ రఘురామ బెయిల్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో ఈ ఉదయం 11 గంటల వరకు విచారణ కొనసాగింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయూర్తి విచారణను 12 గంటలకు వాయిదా వేశారు. పటిషనర్ తరపున సీనియర్ న్యాయవాదుు ముకుల్ రోహిత్గి, ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. రాఘురామను అరెస్టు చేసిన తీరును కోర్టుకు ముకుల్ రోహిత్గి వివరించారు. రఘురామ కేసు విషయంలో కింది కోర్టు ఆదేశాలను సీఐడీ అధికారులు ఏమాత్రం పట్టించికోలేదని న్యాయస్థానికి విన్నవించారు.