
కరోనా వైరస్ వ్యాక్సిన్ తొలి డోసు పరంగా చూసుకుంటే అమెరికా కంటే ఎక్కువ వ్యాక్సిన్లు ఇండియానే ఇచ్చిందని ప్రభుత్వ టాస్క్ ఫోర్స్ చీఫ్ వీకే పాల్ అన్నారు. ఇప్పటి వరకూ ఇండియాలో తొలి డోసు తీసుకున్న వారి సంఖ్య 17.2 కోట్లుగా ఉన్నదని ఆయన తెలిపారు. ఆ లెక్కన అమెరికాను మించిపోయినట్లు అని పాల్ చెప్పారు. కొవిడ్ కేసులు తగ్గుతున్నాయి కదా అని ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడగని కూడా ఆయన హెచ్చరించారు.