Mogli movie : ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ పరిస్థితి అంత బాలేదు. పెరిగిపోతున్న బడ్జెట్ల కారణంగా టిక్కెట్ రేట్లను పెంచడం వల్ల థియేటర్ కి వచ్చే ప్రేక్షకులు కరువైపోయారు. సినిమా బావుంది అనే టాక్ వస్తేనే ప్రేక్షకులు సినిమా థియేటర్ కైతే వస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే సందీప్ రాజ్ దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా, బండి సరోజ్ కుమార్ విలన్ గా తెరకెక్కిన మోగ్లీ సినిమా ఈనెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా టిక్కెట్ రేట్లను చాలా వరకు తగ్గించారు. కేవలం 99 రూపాయలకే సినిమా టిక్కెట్ ను పెట్టడం వల్ల ఈ సినిమాను చూడడానికి చాలా మంది ఆసక్తి చూపించే అవకాశమైతే ఉంది.
ఇక ఇంతకుముందు 200 నుంచి 300 వరకు టిక్కెట్ రేటు ఉండటం వల్ల ప్రేక్షకులు సినిమాల మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ రేట్లు తగ్గించడం వల్ల ప్రతి ప్రేక్షకుడు సినిమా థియేటర్ కి వచ్చి సినిమాను చూసే అవకాశం ఉంటుందనే ఉద్దేశ్యంతోనే ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమం చేపడుతున్నారు. ఇక ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతోంది అనేది తెలియాల్సి ఉంది.
రీసెంట్ గా వచ్చిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా మొదటి రెండు రోజులు టిక్కెట్ రేట్స్ చాలా తక్కువగా పెట్టారు. ఎప్పుడైతే సక్సెస్ ఫుల్ టాక్ వచ్చిందో ఆ తర్వాత టిక్కెట్ రేట్ కొంత పెంచారు. దాంతో సినిమా కలెక్షన్స్ పెరగడమే కాకుండా సగటు ప్రేక్షకులందరు ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ చూపించే అవకాశాలైతే ఉన్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా మోగ్లీ సినిమా ఎంతటి విజయాన్ని సాధిస్తోంది. సందీప్ రాజ్ మొదటి థియేట్రికల్ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…చూడాలి మరి ఈ సినిమా సందీప్ టాప్ డైరెక్టర్ గా మారతాడా? రోషన్ సైతం హీరోగా ఇండస్ట్రీ లో సెటిల్ అయిపోతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…