
భారత స్ప్రింట్ లెజెండ్ మిల్కాసింగ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఆరా తీశారు. టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొంటున్న అథ్లెట్లను ఆశ్వీర్వదించేందుకు, ప్రేరణ అందించేందుకు మిల్కాసింగ్ పూర్తిగా కోలుకొని ఆరోగ్యవంతుడిగా త్వరలోనే తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. శరీరంలో ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో 91 సంవత్సరాల దిగ్గజ స్ర్పింటర్ చండీగఢ్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆసుపత్రికి తరలించారు. ఆయన మే 20న కరోనా బారినపడ్డారు. చికిత్స నిమిత్తం మొదట మొహాలిలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత కోలుకోగా గత ఆదివారమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.