
మోదీ క్యాబినెట్ లో కొత్తగా చోటు దక్కిన వారిలో ఏడుగురు మహిళలు ఉన్నారు. ప్రముఖ న్యాయవాది, ఢిల్లీ ఎంపీ మీనాక్షి లేఖకి కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించింది. మీనాక్షి లేఖి బీజేపీ జాతీయ ప్రతినిధిగానూ పనిచేశారు. అలాగే జార్ఖండ్ కు చెందిన కొడెర్మా ఎంపీ అన్నపూర్ణ దేవికి కేంద్ర మంత్రివర్గంలో పనిచేసే అరుదైన అవకాశం లభించింది. మహారాష్ట్రలోని దిండోరి ఎంపీ భారతీ ప్రవీణ్ పవార్ కూ మంత్రి పదవి లభించింది. నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా, స్మృతి ఇరానీ మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రులుగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే.