
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోవిడ్ బారిన పడడం పై పలువురు మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. కేటీఆర్ కి కరోనా లెక్క కాదు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకారుడు, పోరాట యోధుడు, అన్నింటికీ మించి గుండె నిబ్బరం కలిగిన కేటీఆర్ ని ఇలాంటి సమస్యలు పెద్దగా ఇబ్బంది పెట్టలేవని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.