
రాష్ట్రంలోని 34 ప్రాథమిక పాఠశాలలను ఫౌండేషన్ స్కూల్స్ గా మార్చాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. విద్యాశాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మధ్య సమన్వయంపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఒకటో తరగతి నుంచి ఐదోతరగతి వరకు ఉన్న పాఠశాలల్లో అంగన్వాడీలను విలీనం చేయాలని తెలిపారు. నాణ్యమైన విద్యతోపాటు విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రీ ప్రైమరీ పాఠశాలలు పిల్లలకు దగ్గరగా ఉండాలన్నారు. పాఠశాలలన్ని 3 కీ. మీ దూరంలో అందుబాటులో ఉండాలని చెప్పారు.