
జీఎస్టీ కౌన్సిల్ 43వ సమావేశం శుక్రవారం జరుగనుంది. ఉదయం 11 గంటలకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరుగనుండగా సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించనున్నారు. కొవిడ్ మమమ్మారి సెకండ్ వేవ్ మధ్య రాష్ట్రాలకు పరిహారం, పలు మందులు, వైద్య పరికరాలు, ఆరోగ్య సేవలపై పన్ను మినహాయింపు తదితర కీలక అంశాలపై జీఎస్టీ కౌన్సిల్ చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ తగ్గించడం, పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీలోకి తీసుకురావడంపై చర్చించే అవకాశం ఉంది.