
లాక్ డౌన్ నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం కఠినతరం చేసింది. ఈపాస్ లేని వాహనాలను వెనక్కి పంపుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ తాజా ఆదేశాలతో వాడపల్లి చెక్ పోస్టు దగ్గర నిబంధనలు కఠినతరం చేశారు. అత్యవసర వాహనాలకు గుర్తింపు కార్డులు తప్పనిసరి చేశారు. అంబులెన్సులు, అత్యవసర వాహనాలకు మినహాయింపు ఇస్తున్నారు. జిల్లాలోని నాలుగింటిలో మూడు చెక్ పోస్టులు మూసివేశారు. మఠంపల్లి, పులిచింతల, రామాపురం చెక్ పోస్టులు మూసి వేశారు.