
ఆన్లైన్ గోల్డ్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసానికి పాల్పడుతున్నారు. గోల్ట్ కాయిన్స్, గోల్డ్ బార్స్ ఇస్తామంటూ పెట్టుబడుల ద్వారా ముఠా డబ్బులు కాజేస్తున్నారు. నలుగురిలో ఇద్దరిని ముంబాయిలో పోలీసులు అరెస్టు చేశారు. అధిక కమిషన్ వస్తుందంటూ ప్రజలకు ముఠా వల వేస్తున్నట్లు గుర్తించారు. 3 మొబైల్ ఫోన్స్, రెండు ల్యాప్ టాప్స్, నాలుగు చెక్ బుక్స్, 13సీమ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.