Bhabanipur constituency : 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరం ముంచుకొస్తున్న వేళ, అందరి దృష్టి కోల్‌కతాలోని భవానీ పూర్ నియోజకవర్గంపైనే ఉంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఇది కంచుకోట అయినప్పటికీ, ఈసారి అక్కడ గెలుపు ఆమెకు నల్లేరు మీద నడక కాదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
గత 2021 ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతను ఓడించిన ఆమె మాజీ సహచరుడు, ప్రస్తుత బిజెపి నేత సువేందు అధికారి.. ఈసారి భవానీ పూర్ బరిలోకి దిగుతున్నారు. మమతను ఆమె సొంత నియోజకవర్గంలోనే కట్టడి చేయాలనే వ్యూహంతో బీజేపీ ఈ భారీ అడుగు వేసింది. ఇది కేవలం ఒక నియోజకవర్గ పోరు మాత్రమే కాదు, ఇద్దరు హేమాహేమీల మధ్య సాగుతున్న ‘ప్రతిష్టాత్మక యుద్ధం’.
భవానీ పూర్ నియోజకవర్గంలో హిందువులు, సిక్కులు, జైనులు మరియు గుజరాతీలు వంటి విభిన్న సామాజిక వర్గాలు ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు మరియు స్థానిక సమస్యల పట్ల పట్టణ ఓటర్లు కొంత అసంతృప్తితో ఉన్నట్లు క్షేత్రస్థాయి నివేదికలు చెబుతున్నాయి. మమత ఇప్పటికీ తన సంక్షేమ పథకాల ద్వారా మహిళా ఓటర్ల మద్దతుపైనే ఆశలు పెట్టుకున్నారు.
బీజేపీ ఈసారి భవానీ పూర్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంది. మమతను తన నియోజకవర్గానికే పరిమితం చేయడం ద్వారా, ఆమె రాష్ట్రవ్యాప్త ప్రచారాన్ని దెబ్బతీయవచ్చని బీజేపీ భావిస్తోంది. “అసలైన మార్పు” నినాదంతో బీజేపీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
భవానీ పూర్ లో మమత గెలుపు అంత తేలికేమీ కాదు..దీనిపై ’రామ్‘ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
