Maa Inti Bangaram collections : సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని , భారీ ఓపెనింగ్స్ ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. కేవలం రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కును అందుకొని లాభాల్లోకి అడుగుపెట్టిన ఈ సినిమా, మూడవ రోజుతో బ్లాక్ బస్టర్ హిట్ స్టేటస్ ని చేరుకుంది. ఊపు చూస్తుంటే ఫుల్ రన్ లో ఈ చిత్రం కచ్చితంగా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. మొదటి రోజు కంటే రెండవ రోజు ఎక్కువ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం , రెండవ రోజు కంటే మూడవ రోజు ఎక్కువ వసూళ్లను రాబట్టింది. దీంతో సంక్రాంతి సీజన్ తర్వాత అంతటి స్థాయి లాభాలను చూసిన ఏకైక చిత్రం గా ‘మా ఇంటి బంగారం’ నిల్చింది.
మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, 2 వ రోజున 3 కోట్ల 27 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి, ఇక మూడవ రోజున అయితే ఏకంగా 4 కోట్ల 6 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 9 కోట్ల 68 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 18 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి చూస్తే, నైజాం ప్రాంతం నుండి 5 కోట్ల 28 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఆంధ్ర ప్రదేశ్ నుండి 4 కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా తమిళ వెర్షన్ నుండి ఈ చిత్రానికి దాదాపుగా 1 కోటి రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 2 కోట్ల 40 లక్షలు , ఓవర్సీస్ నుండి 6 కోట్ల 60 లక్షలు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 19 కోట్ల 68 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, 39 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. విడుదలకు ముందు వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 12 కోట్ల రూపాయిలు కాగా, 7 కోట్ల 63 లక్షల రూపాయిల లాభాలు వచ్చాయి. ఫుల్ రన్ లో మరో 7 కోట్ల రూపాయిల లాభాలు తేలికగా రావొచ్చు , ఆ స్థాయిలో ఈ సినిమా థియేట్రికల్ రన్ కొనసాగుతోంది.
