
తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందకపోవడం వల్ల 11 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారనే వార్త తీవ్ర ఆవేదనను కలిగించింది. ఊపిరి అందించే వాయువుని సక్రమంగా అందించని దుస్థితి నెలకొనడం వల్లే అత్యంత విషాదకరమైన ఈ ఘటన చోటు చేసుకొందని జనసేన పార్టీ అధ్యక్షడు పవన్ కల్యాణ్ అన్నారు. రాయలసీమ ప్రజల వైద్య అవసరాలకు కేంద్రమైన రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా, వైద్యపరమైన మౌలిక వసతులు సరిగా లేవని రోగులు ఎంత ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని అందరూ చెబుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించుకోలేదని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.