
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి 15 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌడన్ విధిస్తున్నట్లు యడియూరప్ప సర్కార్ ప్రకటించింది. కాగా కొద్ది రోజులుగా కర్ణాటకలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా బెంగళూరు లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న కోవిడ్ మరణాల్లో 70 శాతం మరణాలు బెంగళూరులో నమోదవుతున్నాయి.