
జూపార్కులో కొవిడ్ బారిన పడిన సింహాలు కోలుకుంటున్నాయి. వైరస్ సోకినట్లుగా అనుమానించిన సింహాలను ముందుానే క్వారంటైన్ లో ఉంచారు. ప్రత్యేకంగా వైద్య సేవలు అందిస్తున్నారు. రోజూ ఇచ్చే ఆహారం పాటు పౌష్టికాహారం మందులు ఇస్తున్నారు. మరో మూడు రోజుల్లో వాటి క్వారంటైన్ సమయం కూడా ముగుస్తుందని అధికారులు తెలిపారు. జూపార్కులో మొత్తం 1600 కు పైగా జంతువులు, పక్షలు, వన్యప్రాణులు ఉన్నాయి. మిగతా జంతువుల్లో కరోనా సోకినట్లుగా ఆనవాళ్లు లేవన్నారు. జూపార్కులోని కొంతమంది యానిమల్ కీపర్లకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది.