
బిహార్ లో అధికార జేడీయూ పార్టీ అధ్యక్షుడిగా లలన్ సింగ్ నియమితులయ్యారు. ఇదివరకు అధ్యక్షుడిగా ఉన్న రాజీవ్ రంజన్ కు కేంద్ర మంత్రి పదవి దక్కడంతో ఆయన స్థానంలో లలన్ ఎన్నికయ్యారు. ఈ మేరకు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆర్సీపీ సింగ్ కు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ లో కేంద్రమంత్రిగా స్థానం దక్కడంతో జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా వైదొలిగారు. లలన్ సింగ్ ముంగేర్ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచి పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.