
కోటి కొవిడ్ టీకా డోసులు కొనుగోలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ టెండర్లు ఆహ్వానిస్తే ఎలాంటి స్పందన రాలేదు. బిడ్లు దాఖలు చేసేందుకు గడువు ఈరోజు సాయంత్రంతో ముగియగా ఒక్క ఫార్మా సంస్థ కూడా బిడ్ దాఖలు చేసేందుకు ముందుకు రాలేదు. కొవిడ్ టీకాలు గ్లోబల్ టెండర్లు ద్వారా కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో నిర్ణయించింది. మేరకు గత నెల 26న ప్రీబిడ్ సమావేశం నిర్వహించగా ఆస్ట్రాజెనికా స్పుత్నిక్ కంపెనీల ప్రతినిధులు మాత్రమే పాల్గొన్నారు.