
కోవిడ్ టీకాలో కోవిషీల్డ్ ధరను తగ్గిస్తున్నట్లు సీరం ఇనిస్టిట్యూట్ సంస్ధ అధినేత అధర్ పూనావాలా ప్రకటించారు. అయితే కేవలం రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే టీకాలకు మాత్రమే ఈ ధరను తగ్గిస్తున్నట్లు అధర్ వెల్లడించారు. తగ్గింపు ధరలు ఇప్పటికిప్పుడే అందుబాటులోకి వస్తాయని ప్రకటించిన ఆయన దీంతో రాష్ట్ర ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయల ఆదాయం ఆదా అవ్వడమే కాకుండా మరింత ఎక్కవ మంది ప్రాణాలను కాపాడడానికి అవకాశం ఉంటుందని అన్నారు.