
డిసెంబర్ నాటికి అందరికీ కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తెలిపారు. కరోనా లాంటి విపత్కరణ పరిస్థిల్లో కాంగ్రెస్ అరాచక ప్రచారాలతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నదని ఆయన మండిపడ్డారు. రాజస్థాన్ లో కరోనా పరిస్థితిపై ఆ రాష్ట్ర అధ్యక్షడు, ఎంపీ సతీష్ పునియాతో ఆయన వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా రెండో వేవ్ తో అప్రమత్తంగా ఉండాలని మార్చిలోనే ప్రధాని మోదీ అన్ని రాష్ట్రా ల సీఎంలను హెచ్చరించారని అన్నారు.