
భవిష్యత్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ను ప్రోత్సహించాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. కేఎల్ రాహుల్ నాయకత్వ లక్షణాలున్నాయన్నాడు. ఓ కొత్త కెప్టెన్ ను తయారు చేయాలనుకుంటే రాహుల్ పై దృష్టి పెడితే మంచిదని చెప్పాడు. కేఎల్ రాహుల్ 50 ఓవర్ల క్రికెట్ లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడని అతణ్ని వైస్ కెప్టెన్ గానూ నియమించవచ్చని సన్నీ తెలిపాడు. కేఎల్ రాహుల్ ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.