
కేంద్ర కేబినెట్ మంత్రిగా సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు జి. కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర పతి రాంనాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. గతంలో ఆయన కేంద్ర హోంశాఖా సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన పనితీరును మోదీ పరిగణనలోకి తీసుకొని కేంద్ర కేబినెట్ మంత్రిగా పదోన్నతిగా కల్పించారు.