KCR: కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరుకావాల్సిన తేదీ మారింది. ఈనెల 11న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు ఆయన హాజరుకానున్నారు. కేసీఆర్ కోరిక మేరకు విచారణ తేదీని కాళేశ్వరం కమిషన్ మార్చింది. తొలుత ఈనెల 5న విచారణకు కేసీఆర్ హాజరుకావాల్సి ఉండగా.. తాజాగా 11కి మార్చారు.