Abu Dhabi Big Ticket lottery : కొన్ని సందర్భాలలో మనం ఊహించనిది జరుగుతుంది. మనం అంచనా వేయనిది చోటు చేసుకుంటుంది. అటువంటిదే ఈ సంఘటన కూడా. అతడి జాతకాన్ని ఆ సంఘటన మార్చేసింది. చూస్తుండగానే కోటీశ్వరుడిని చేసేసింది.
మనదేశంలో కేరళ రాష్ట్రం మాదిరిగానే అబుదాబిలో ప్రభుత్వం లాటరీ వ్యాపారం నిర్వహిస్తూ ఉంటుంది. టికెట్ లు విక్రయించిన తర్వాత.. ఒకరోజు లాటరీ తీస్తూ ఉంటుంది. అయితే ఈసారి ఆ లాటరీ అదృష్టం ప్రవాస భారతీయుడికి దక్కింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఈ లాటరీ ద్వారా అతడు 49 కోట్లు గెలుచుకున్నాడు. అబుదాబిలో బిక్ టికెట్ లో అతడు లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. తన స్నేహితుడితో కలిసి సరదాగా అతడు ఆ టికెట్ కొనుగోలు చేశాడు. లాటరీలో అతడికి ఏకంగా 49 కోట్లు లభించాయి.
టికెట్ కొనుగోలు చేసిన ఆ వ్యక్తి పేరు శాంతను. ఇతడిది కర్ణాటకలోని ఉడిపి ప్రాంతం. మస్కట్ లో రిటైల్ రంగంలో అతడు పనిచేస్తున్నాడు. తన స్నేహితుడితో కలిసి బిగ్ టిక్కెట్ లాటరీ కొనుగోలు చేశాడు. ఇటీవల లాటరీలో డ్రా తీయగా అతని టికెట్ నెంబర్ కనిపించింది. ఊహించని విధంగా అతడికి బిగ్ జాక్ పాట్ తగిలింది.. ఈ డ్రాలో అతడు తన టికెట్ ద్వారా 49 కోట్లు గెలుచుకున్నాడు. శంతను ఈ స్థాయిలో డబ్బు గెలుచుకోవడంతో అతని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
“ఇది నమ్మలేకపోతున్నాను. ఆనందంగా ఉంది. చూస్తుండగానే 49 కోట్లు నాకు వచ్చాయి. ఇదంతా ఇప్పటికి కల మాదిరిగానే అనిపిస్తోంది. సరదాగా టికెట్ కొనుగోలు చేశాను. కానీ డ్రాలో నేను కొనుగోలు చేసిన టికెట్ నెంబర్ ఉండడంతో ఆశ్చర్యపోయాను. నా స్నేహితుడు ఈ విషయాన్ని చెబుతుంటే అలానే ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాను. ఈ డబ్బు ద్వారా చాలా పనులు చేయాలి. చాలా ఆనందాలను పోగేసుకోవాలని” శాంతను పేర్కొన్నాడు..
