Kakani Govardhan Reddy: వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి రిమాండ్ ను కోర్టు 14 రోజులు పొడిగించింది. అటు ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను ఈనెల 11కు న్యాయస్థానం వాయిదా వేసింది. ప్రస్తుతం ఆయన నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అక్రమ మైనంగా, గిరిజనులను బెదిరించిన కేసులో ఏ4 గా ఉన్న కాకాణి బెంగళూరు సమీపంలోని ఓ రిసార్టులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.