జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తిస్తున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు తెలిపారు. ఎల్లుండి నుంచి జర్నలిస్టులకు వ్యాక్సినేషన్ ను ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. సమాచార శాఖ ద్వారా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాలను 1200కు పెంచినట్లు తెలిపారు. తెలంగాణలో ఇప్పటి వరకు 56 లక్షల మందికి టీకాలు వేసినట్లు డీహెచ్ వెల్లడించారు. ప్రస్తుతం 6.18 లక్షల కొవిషీల్డ్, 2.5 లక్షల కొవాగ్జిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.