
యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత, జితిన్ ప్రసాద కాంగ్రెస్ పార్టీని వీడి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో బుధవారం బీజేపీలో చేరారు. రెండు సార్లు ఎంపీగా పనిచేసిన జితిన్ ప్రసాద్ రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా పేరొందారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్ పార్టీని వీడటం ఆ పార్టీకి ఎదురుదెబ్బగా పరిశీలకులు భావిస్తున్నారు.