Jananayagan First Glimpse Teaser: తమిళ్ హీరో విజయ్ 69 చిత్రం జననాయగన్ ఫస్ట్ గ్లింప్స్ టీజర్ విడుదల డేట్ ఫిక్స్ చేశారు. ఈ నెల 22 న జననాయగన్ టీజర్ విడుదల కానుంది. ఇదే తన చివరి సినిమా అని విజయ్ ప్రకటించాడు. ఇప్పటికే రాజకీయాల్లోకి అడుగు పెట్టిన విజయ్ త్వరలో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడనున్నారు. విజయ్ చివరి చిత్రాన్ని కేవీఎస్ ప్రొడక్షన నిర్మిస్తోంది. జననాయగన్ సినిమా కోసం కెవిఎస్ వెంకట్ కె నారాయణ్ భారీ బడ్జెట్ ను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. భారీ సెట్లు, భారీ వీఎఫ్ఎక్స్ మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా చిత్రీకరణ జరుపుకుందని తెలుస్తోంది.
Thalapathy Vijay’s #JanaNayagan glimpse on June 22 pic.twitter.com/1Jw05dEK3O
— Ruthish (@itsruthish) June 11, 2025