
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉత్తర భారతదేశ పర్యటనకు వెళ్లనున్నారు. శిమ్లా తదితర ప్రాంతాల్లో సీఎం పర్యటించనున్నట్లు తెలిసింది. ఈ నెల 30 లేదా 31 న ఆయన తన పర్యటన ముగించుకుని తిరిగి వస్తారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.