
ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ షురూ చేశాడు. మొన్నటిదాకా టెస్టులు ఆడిన రోహిత్ ఇప్పుడు రాబోయే ఐపీఎల్ టీ20 మ్యాచుల్లో రాణించాలంటే వేగంగా పరుగుల చేయడంపై దృష్టి పెట్టాల్సి ఉంది. ఈ క్రమంలో రోహిత్ సాధన మొదలు పెట్టాడు. తాను నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు పంచుకుంటూ గేర్లు మార్చాల్సిన సమయం వచ్చింది అని రాసుకొచ్చాడు. ఐపీఎల్ లో విజయవంతమైన కెప్టెన్ గా రోహిత్ పేరు తెచ్చుకున్నాడు.