
రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవిమల్లెలో నిర్వహించిన గ్రామ సభలో మంత్రి పువ్వాడ అజయ్ తో కలిసి ఎర్రబెల్లి పాల్గొన్నారు. రైతులను ఆదుకున్నది ఇద్దరు మాత్రమేనని వారే ఒకరు ఎన్టీఆర్ మరొకరు కేసీఆర్ అని వెల్లడించారు. సీఎం కేసీఆర్ కు ప్రజలంతా అండగా ఉండాలని కోరారు.