Quantum Valley Park Amravati: అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పార్కు ఏర్పాటుపై ఐటీశాఖ ఉత్వర్వులు జారీ చేసింది. క్వాంటమ్ వ్యాలీ పార్కు నిర్మాణానికి 3 సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఐబీఎం సంస్థ అడ్వాన్స్ డ్ క్వాంటమ్ కంప్యూటింగ్ కు సంబంధించిన మౌలిక సదుపాయాలను క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్కు లో కల్పస్తుంది. అత్యంత శక్తిమంతమైన ఐబీఎం 156 క్యూబిట్ క్యాంటమ్ సిస్టం టూ ను అందుబాటులోకి తెస్తుంది. దీని వల్ల క్వాంటమ్ నైపుణన్యం, పరిశోదన, సహకారం, విద్యావనరులు పొందేందుకు వీలు ఉంటుంది.