
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ అనుమానపద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. సుశాంత్ మృతికి సంబంధించిన కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా సుశాంత్ మృతికి సంబంధించి రిపబ్లిక్ టీవి ఛీఫ్ ఎడిటర్ అర్నబ్ గోస్వామి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. సుశాంత్ అనుమానాస్పద మృతి పై అసలు నిజాన్ని సోమవారం ఉదయం 10 గంటలకు వెల్లడిస్తామని… అతనిని ఎవరు చంపారో చెప్పబోతున్నానని వెల్లడించడం సంచలనంగా మారింది.